మన ఇంట్లో పుదీనా పెంచితే ఎన్నో ఉపయోగాలు
mint leaves to make oil |
హలో మిత్రులారా ఈ రోజు నేను మీకు మన ఇంటి పరిసరాల్లో సహజంగా లభించు పుదీనా మొక్క యొక్క అబ్దుతమైన ఉపయోగాల గురించి మీకు తెలియచేయబోతున్నాను.
నేను ఈ ఆర్టికల్ చూపించే ఉపయోగాలు మన ఆరోగ్యానికి సంబందించినవి కనుక మీ విలువైన సమయాన్ని కొంత ఈ ఆర్టికల్ చదవటానికి వినియోగిస్తే ఆరోగ్యం మీ సొంతం.
మీకు తెలుసా.! కడుపు నొప్పిని తగ్గించేందుకు పుదీనా జ్యూస్
తయారీ విదానం:
ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లు తీసుకోండి. అందులో ఒక చెంచాడు పుదీనా యొక్క రసాన్ని కలపండి.. తరువాత ఒక అర చెక్క నిమ్మరసం, అందులో కొద్దిగా ఉప్పు, పావు చెంచా తినే సోడా వేసి బాగా కలిపి, తాగేయండి. మీ కడుపు నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. ఈ చిట్కా చిన్న పిల్లలకు కూడా చక్కగా పనిచేస్తుంది. అలాగే ఆకలి తక్కువగా ఉంటే అప్పుడు ఒక చెంచా పుదీనా రసం, ఒక చెంచా అల్లం రసం అరగ్లాసు గోరు వెచ్చని నీళ్లలో కలిపి తాగితే పది నిమిషాల్లో ఆకలి పుడుతుంది. కనుక పుదీనా ను ఇంటపెరట్లో పెంచుకోండి.
mint leaves are using in juice |
అలాగే మనకు జలుబు ను తగ్గించేందుకు కూడా పుదీనా ఉపయోగపడుతుంది.
ఎప్పుడైనా జలుబు తీవ్రంగా ఉన్నపుడు. ముక్కు తరచుగా కారుతున్నపుడు ఐదు లేదా ఆరు పుదీనా రెమ్మలను నోట్లో వేసుకుని మెల్లిగా కొరుకుతూ వచ్చిన రసాన్ని నెమ్మదిగా చప్పరిస్తుంటే జలుబు నెమ్మదిగా తగ్గిపోతుంది ఇది ఒక చిన్న గృహ చిట్కా. ఒక వేల ఈ చిట్కా తో జలుబు తగ్గకపోతే ఇంకొక ఉపాయం ఏమిటో చూద్దాం.
జలుబు తగ్గించేందుకు మరో విధానం: మొదట ఒక చెంచా పుదీనా రసం, ఒక చెంచా తులసి ఆకుల రసం, ఒక చెంచా అల్లం రసం, పావు చెంచా పసుపు, పావు చెంచా మిరియాల పొడి, పావు చెంచా పిప్పళ్ల పొడి అర గ్లాస్ నీళ్ళల్లో కలుపుకొని రెండు పూటలు బాగా తాగితే ఎలాంటి జలుబు అయినా తొందరగా తగ్గుతుంది.
ఒక్క నిమిషం ఆగి వీటిని కూడా చదవండి.
పుదీనా యొక్క మరొక ఉపయోగం:
ఇంట్లో మరిగించిన పాలను మనం మళ్ళి కాగపెట్టినప్పుడు కాస్త ఆలస్యం అయితే కొన్నిసార్లు పాలు విరిగిపోతుంటాయి. అందువలన అలా కాకూడదు అనుకుంటే పాలు మరిగి చల్లార్చిన తరువాత పాల గిన్నెలో ఐదు లేదా ఆరు పుదీనా ఆకులు వేస్తె మళ్ళి మరగపెట్టేందుకు ఆలస్యం అయినా ఆ పాలు విరిగిపోకుండా ఉంటాయి.
అంతేకాకుండా జ్వరంతో భాదపడుతున్న లేదా, వికారంతో ఆకలి లేకపోయినా అప్పుడు పుదీనా ఆకు, చింతపండు, జిలకరతో చేసిన పుదీనా పచ్చడి తింటే వికారం తగ్గుతుంది. ఆకలి కూడా వేస్తుంది. మరయు పుదీనా పచ్చడి ఎంతో ఆరోగ్యకరం కూడా.
ఇప్పుడు పుదీనా పువ్వు యొక్క ఉపయోగాలు చూద్దాం.
mint flowers |
మనకు బయట పుదీనా పువ్వు స్పటికాలుగా లభిస్తాయి తెలుసా దీన్ని పుదీనా మొక్క సమూలాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఇది చాలా శక్తివంతం అయినది. దీనిని మింట్ పిప్పరమెంట్లలో, పెయిన్ బామ్స్ లలోనూ, పెయిన్ కిల్లర్ స్ప్రేలలోను మరియు ఇతర మందులలో ను ఈ పుదీనా పువ్వులను వాడుతారు.
పుదీనా ఆయిల్ ను తయారుచేసే విదానం:
మొదట ఇరవై గ్రాముల పుదీనా పువ్వును తీసుకొని అందులో మరో ఇరవై గ్రాముల కొబ్బరి నూనెను కలిపితే పుదీనా ఆయిల్ చక్కగా తయారవుతుంది.
mint oil used to relief pains |
ఉపయోగాలు:
ఈ ఆయిల్ ను తల నొప్పికి, మరియు మోకాళ్ళ నొప్పులకి బాగా మర్దనా చేస్తే క్షణాల్లో ఉపశమనం కలుగుతుంది. అలాగే జలుబు చేసినప్పుడు, ముక్కులు బిగుసుకు పోయినప్పుడు ఈ పుదీనా ఆయిల్ ను రెండు డ్రాప్స్ వేసి ఆవిరి పడితే ముక్కులకు వెంటనే శ్వాస బాగా అందుతుంది. ఊపిరి పీల్చుకోటానికి సులవుగా ఉంటుంది.
ఇలా ఈ యొక్క పుదీనా వల్ల ఇంకా చాల ఉపయోగాలు ఉన్నాయి కనుక ఈ పుదీనా మొక్క మీ ఇంటి ఆవరణం లో పెంచుకోండి. కొంత మందికి పెంచటానికి పుదీనా మొక్కలు కూడా దొరకకపోతే మార్కెట్ లోకి వెళ్లి మంచి పుదీనాని తెచ్చుకొని ఒక చిన్న కొమ్మని కుండీ లో వేసి నాటి అది కొంచెం బాగా పెరిగే అంతవరకు ఎక్కువ ఎండ తగలకుండా నీళ్లు పోయండి చాలు కొన్ని రోజులలోనే బాగా గుబురుగా ఎదిగిపోతాయి.
మరియు ఈ యొక్క పుదీనా మొక్కల యొక్క జ్యూస్ లు,నూనెలు బైట మార్కెట్ లలో కూడా మనకి దొరుకుతాయి కనుక ఒకవేళ మీరు ఇంట్లో పుదీనా నూనెను ను లేదా జ్యూస్ లను చేసుకోటానికి కుదరకపోతే మంచి ప్రోడక్ట్ బ్రాండ్ ని చూసి తీసుకోండి. అంతేకాని వేరే వేరే పిచ్చి పిచ్చి బ్రాండ్స్ లను కొనకండి ఎందుకంటే వాటిల్లో ఎక్కువగా కెమికల్స్ మరియు కల్తీ చేసి ఉంటాయి. కనుక మంచి బ్రాండ్ ని చూసి తీసుకోండి. కనుక వీలయినంత వరకు ఇంట్లో నే చేసుకోటానికి ప్రయత్నించండి. ఇంక కుదరకపోతేనే బయట కొనుక్కోండి.
కనుక ఇటువంటి ముఖ్య విషయాల కొరకు మరియు ఉపయోగకరమైన అంశాలకొరకు నా బ్లాగ్ ని అనుసరించండి మరియు నా బ్లాగ్ ని అందరికి తెలియచేసి మీ యొక్క ఆధారణలు నాకు అందించండి.
ఇటువంటి ముఖ్య విషయాల కొరకు మరియు ఉపయోగకరమైన అంశాలకొరకు నా బ్లాగ్ ని అనుసరించండి మరియు నా బ్లాగ్ ని అందరికి తెలియచేసి మీ యొక్క ఆధారణలు నాకు అందించండి. అలాగే మీకు ఉన్న ఎటువంటి సలహాలైన లేదా సందేహాలైన నాకు మీ కామెంట్స్ రూపం లో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.
ఈ రోజు ఇంతటితో ఈ యొక్క అంశాన్ని నేను ముగిస్తున్నాను. మరలా ఈ సారి ఇంకొక ముఖ్యమైన మరియు ఉపయోగకరమైన, ఆరోగ్యకరమైన అంశాలతో తిరిగివస్తాను. అంతవరకూ సెలవు బాయ్.
1 Comments
Excellent bro
ReplyDelete